calender_icon.png 9 December, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓట్ల చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ

09-12-2025 12:00:00 AM

శామీర్‌పేట్, డిసెంబర్ 8: ఓట్ల చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మూడుచింతలపల్లి మున్సిపాలిటీలోని కేశవరం లో సోమవారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోసకాయల వెంకటేష్ లు పాల్గొన్నారు.

హలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎన్నికల వ్యవస్థ స్వయం పాలన , స్వీయ నిర్ణయాధికారం కాపాడడానికి సంతకాలను సేకరణ కార్యక్రమం చేపట్టామన్నారు. దొంగ ఓట్లతో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండి జగన్నాథం, మాజీ ఉపసర్పంచ్ వెంకటరమణారెడ్డి, బసవ రెడ్డి, బాలకృష్ణ, మహేష్, శేఖర్, మల్లేశం ,యూసుఫ్ ,జయల పాండు, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.