పోచమ్మ ఆలయం వద్ద బోర్ బావి మరమ్మతులు
06-03-2026 07:12 PM
పెంచికల్పేట,(విజయక్రాంతి): పెంచికల్పేట మండలంలోని అగర్‌గూడ గ్రామ దేవత పోచమ్మ ఆలయం సమీపంలో ఉన్న బోర్ బావి చెడిపోవడంతో గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గమనించిన సర్పంచ్ అల్లూరి రాజేశ్వరి రాజు ఆధ్వర్యంలో బోర్ బావిని మరమ్మతు చేయించారు.
బోర్ బావి రిపేరింగ్ పూర్తిచేయడంతో ఆలయానికి వచ్చే భక్తులు మరియు గ్రామ ప్రజలకు తాగునీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని స్థానికులు తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించిన సర్పంచ్‌కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.




