పార్లమెంట్ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు
న్యూఢిల్లీ: జనవరిలో ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలకు తెరదించుతూ, లోక్‌సభ శనివారంనాడు నిరవధికంగా వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశం కాగానే, స్పీకర్ ఓం బిర్లా తన ముగింపు వ్యాఖ్యలను చదివి వినిపించారు. ఆ వెంటనే ఆయన సభను 'సైన్ డై' (Lok Sabha adjourned sine die) వాయిదా వేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు(Parliament special session) మూడ్రోజుల పాటు కొనసాగాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు(Women's Reservation Bill) నిన్న లోక్ సభలో వీగిపోయిన విషయం తెలిసిందే. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు నిన్న లోక్ సభలో వీగిన మహిళా రిజర్వేషన్ కోసం సభ ముందుకు తెచ్చారు.
మహిళా బిల్లు మూడింటి రెండు వంతుల మెజారిటీ సాధించ లేకపోయింది. బిల్లు వీగిపోవడంతో లోక్ సభ సీట్ల పెంపు ప్రక్రియ నిలిచిపోయింది. రాజ్యాంగ సవరణ బిల్లు వీగినందున మిగతా రెండింటినీ కేంద్రం ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. యూటీ చట్టాల సవరణ, డీలిమిటేషన్ బిల్లులను కేంద్రం వెనక్కి తీసుకుంది. మహిళా రిజర్వేషన్ సహా లోక్ సభ స్థానాల పెంపు బిల్లు వీగిపోయింది. 2029 నాటికి లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశంతో, దిగువ సభలోని సీట్ల సంఖ్యను 543 నుండి 816కు పెంచే రాజ్యాంగ సవరణ బిల్లు, ఓట్ల విభజన ద్వారా వీగిపోయిన ఒక రోజు తర్వాత ఈ సమావేశాలు ముగిశాయి.






