1 July, 2026 | 10:23 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఆ ఇద్దరూ బడి మానేశారు..!

14-06-2025 12:00 AM

రెండు రోజులుగా టీచర్ నిరీక్షణ 

పాఠశాలకు వచ్చేదే ఇద్దరు విద్యార్థులు.. ఆ ఇద్దరు ఈ ఏడాది బడికి రావడం మానేశారు. దీనితో రెండు రోజులుగా విద్యార్థుల కోసం ఉపాధ్యాయుడు ఏకాకిగా నిరీక్షిస్తున్నారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెద్దమోరి తండా శివారు కొత్తూరులో వెలుగు చూసింది. గత విద్యా సంవత్సరం ముగింపు వరకు పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు చదువుతుండగా అందులో ఉమాదేవి నాలుగో తరగతి, సాత్విక్ మూడో తరగతి ముగించారు.

ఈ విద్యా సంవత్సరం గురువారం ప్రారంభం కాగా ఉమాదేవి ఐదో తరగతి, సాత్విక్ నాలుగో తరగతిలో చేరాల్సి ఉంది. అయితే గురువారం ఆ ఇద్దరు విద్యార్థులు పాఠశాలకు రాకుండా ముఖం చాటేశారు. విద్యార్థుల కోసం హెడ్మాస్టర్ వీరభద్రయ్య వారి ఇండ్లకు వెళ్లగా మేము హాస్టల్లో చేరుతామని, బడికి రామని చెప్పారు. రెండో రోజైనా మనసు మార్చుకొని పాఠశాలకు వస్తారని ఎదురు చూస్తున్న హెడ్మాస్టర్ కు నిరాశే ఎదురయ్యింది. శుక్రవారం కూడా పాఠశాలకు విద్యార్థులు రాకపోవడంతో కొత్తూరు పాఠశాల ‘ 0 ’ అటెండెన్స్ గా నిలిచింది.

 మహబూబాబాద్, విజయక్రాంతి