1 July, 2026 | 11:24 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

తిరుమలహిల్స్ పార్క్‌ను అభివృద్ధి చేయాలి

14-06-2025 12:00 AM

మణికొండ జూన్ 13: ఇటీవల కబ్జా చెర నుంచి బయటపడిన మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని తిరుమలహిల్స్ పార్క్ ను అభివృద్ధి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తిరు మలహిల్స్ లోని సర్వే నెంబర్ 87, 119లో 6054 చదరపు గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి ఇటీవల అధికారులు విడిపించారు. 5 వేల చదరపు గజాల భూమికి అధికారులు వి ముక్తి కల్పించారు.

ఇంకా దాదాపు 1200 చదరపు గజాల భూమిని కూడా స్వాధీనం చేసుకుని ఈ స్థలంలో ఉన్న పార్క్ ను అభివృద్ధి చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. అధికారులు శ్రద్ధ పెడితే ఈ పార్క్ సౌకర్యవంతంగా, ఆహ్లాకరంగా మారుతుందని ప్రజలు అంటున్నారు.

పార్క్ స్థలంలో మంచి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే సమీపంలోని డాలర్ హిల్స్, తిరుమలహిల్స్, సెక్రటేరియట్ కాలనీ, లాలమ్మ గార్డెన్, బైయూత్ కాలనీ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయం స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది. ఈ పార్క్ స్థలంలో చెట్లు నాటి మరింత అందంగా మార్చాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.