29 August, 2026 | 11:33 PM

బిఆర్ అంబేద్కర్, రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు.. దేశ ద్రోహమే

29-08-2026 10:33 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): భారత రాజ్యాంగం, అంబేద్కర్ పై అనుచిత వాఖ్యలకు నిరసనగా బెల్లంపల్లి అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన వేదిక ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు  మాట్లాడుతూ వర (హమరా) ప్రసాద్ అనే వ్యక్తి అతని వెనుకుండి నడిపిస్తున్న వ్యక్తులు అంబేద్కర్ పై, భారత రాజ్యాంగంపై అనుచిత వాక్యాలు చేస్తూన్నారని  మండిపడ్డారు.

గతంలో అంబేద్కర్ బతికున్న రోజుల్లో తాము వుంటే కాల్చి పరే సే వారమని, ఇప్పుడు అంబేద్కర్ ఒక కల్పిత నాయకుడు అంటు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.  అంబేద్కర్ పై కల్పిత పుస్తకాన్ని తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.  కార్యదర్శి చంద్రమౌళి, మాజీ కౌన్సిలర్ ఎల్తూరు శంకర్ మాట్లాడుతూ...  భారత దేశంలో అంబేద్కర్ పేరును భారత రాజ్యాంగాన్ని లేకుండా చేసే కుట్రలను ఖండిస్తూ అంబేద్కర్ కల్పిత నాయకుడంటూ విష ప్రచారం చేస్తున్న హమరా ప్రసాద్ ను అతని వెనుకున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ పై ఎవరు అనుచిత వాక్యాలు చేసిన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.