కిమ్స్‌లో 10వేలకు పైగా బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలు
- విజయవంతంగా శస్త్రచికిత్సల నిర్వహణ
- రోబోటిక్ డిజిటల్ మైక్రోస్కోప్‌ను ఆవిష్కరించిన డాక్టర్ భాస్కర్‌రావు
హైదరాబాద్, జూన్ 7(విజయక్రాంతి) : కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ మరో ప్రతిష్ఠాత్మక మైలురాయిని అధిగమించింది. 10 వేలకు పైగా బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలను విజయవంతంగా చేశామని వెల్లడించింది. అంతర్జాతీయ బ్రెయిన్ ట్యూమర్ డే దినోత్సవాన్ని పురస్కరించుకొని రోబోటిక్ డిజిట్ మైక్రోస్కోప్‌ను ఆవిష్కరించారు కిమ్స్ గ్రూఫ్ ఆఫ్ హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ భాస్కర్‌రావు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఇటీవల కాలంలో అందుబాటులోకి వ స్తున్న ఆధునిక పరికరాలతో శస్త్రచికిత్సలు చే యడం సులభతరమవుతుంది. దీంతో రోగు లు కూడా త్వరగా కోలుకుంటున్నారు. టెక్నాలజీ ఎంతో వేగంగా విస్తరిస్తుంటే రోగులకు సౌకర్యంగా మారుతుందన్నారు. రోబోటిక్ డిజిటల్ మైక్రోస్కోప్ ద్వారా మెదడులోని, వెన్నుముకల్లోని సమస్యలకు పూర్తిగా చెక్ పెట్టవచ్చన్నారు. నేడు యువత స్మార్ట్ లైఫ్ కి అలవాటు పడ్డారు. దీంతో శారీరక శ్రమ కరువైంది.
గంటల తరబడి ఫోన్లు, టీవీలు, ల్యాప్ టాప్‌లు వాడుతున్నారు. సమయపాలన లేకుండా పనులు చే యడం, హియర్ ఫోన్లు పెట్టుకొని పెద్దశబ్దాలతో పాటలు వినడం లాంటివి చేస్తున్నారు. ఇవీ బ్రెయిన్ మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక బ్రెయిన్ కోసం కి మ్స్ హాస్పిటల్స్ సికిందరాబాద్ లో గామా నైఫ్ రేడియో సర్జరీ వంటి ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉంది. ప్రారంభ దశలోనే గుర్తించి విజయవంతంగా చికిత్స చేయడం సాధ్యమవుతోంది.
ఇప్పటి వరకు పదివేలకు పైగా బ్రెయిన్ ట్యూమర్లకు ఇక్కడ విజయవంతంగా చికిత్స అందించామని తెలిపారు. సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ మానస్ పాణిగ్రాహి మాట్లాడుతూ మారుతున్న జీవనశైలిలో భాగంగా అనేక రకమైన వ్యాధులు ప్రజల్ని ఇబ్బందులుకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా బ్రెయిన్ ట్యూమర్లు ఇప్పుడు వస్తున్నాయి. వేకువ జామున, ఉదయం లేవగానే తీవ్రమైన తలనొప్పి ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులకు చూపించాలని సూచిం చారు.
మేము చేసిన ఈ పదివేలకు పైగా చేసిన శస్త్రచికిత్సల్లో దాదాపు 10 శాతానికిపైగా పిల్లలలో చేశామన్నారు.మరో కన్సల్టెం ట్ న్యూరోసర్జన్ శ్వేత మాట్లాడుతూ చాలామంది బ్రెయిన్ ట్యూమర్ అనేది వృద్ధులకు మాత్రమే వస్తుందని భావిస్తారు. కానీ ఇది ఏ వయసులోనైనా రావచ్చు అని అన్నారు. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు ట్యూమర్ ఉన్న ప్రాంతం, పరిమాణాన్ని బట్టి మారుతుంటాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చునన్నా రు.
ఈ కార్యక్రమంలో న్యూరోసర్జరీ విభా గం వైద్యులు డా. చంద్రశేఖర్ నాయుడు, డా. సుజిత్ కుమార్, డా. విజయంత్, డా. గోపాల్ కృష్ణ, డా.సివిఎస్. ధాశరధి, న్యూరాలజీ విభాగం వైద్యులు, గతంలో బ్రెయిన్ ట్యూమర్లుకు చికిత్స చేయించకున్న బాధితులు, చిన్నారులు పెద్ద ఎత్తున్నపాల్గొన్నారు. చిన్నారుల కోసం ప్ర త్యేకంగా పెయింటింగ్ పోటీలను నిర్వహించారు. గెలిచిన వారికి బహుమతులు ప్రధానం చేశారు.






