6 August, 2026 | 10:18 AM

తల్లిపాలు బిడ్డల ఆరోగ్యాన్ని పెంచుతాయి

06-08-2026 08:40 AM

సర్పంచ్ కలకోట్ల శైలందర్ 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఆగస్ట్ 05: తల్లిపాలు బిడ్డలు ఆరోగ్యంగా పెరగడానికి ఎంతో దోహదం చేస్తాయని సర్పంచ్ కలకోట్ల శైలందర్ అన్నారు.బుధవారం మండలంలోని అడివెంల గ్రామ అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల సందర్బంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.ప్రతీతల్లి చిన్నారులకు ముర్రుపాలు పట్టించాలని సూచించారు.ముర్రుపాలు పట్టించడం ద్వారా అనేక రకాల జబ్బులు రాకుండా పిల్లలను కాపాడవచ్చని తెలిపారు.అంగన్వాడీ కేంద్రం ద్వారా అందించే పౌష్టికాహారాన్ని గర్భిణీలు,బాలింతలు,చిన్నారులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వజ్జె రవి,పాఠశాల హెచ్ఎం యాదమ్మ,ఉపాధ్యాయులు విజయలక్ష్మి,కరుణ అంగన్వాడీ టీచర్లు కళమ్మ,సరోజ,వార్డుసభ్యులు,గర్భిణీలు,బాలింతలు,చిన్నారులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.