టెలిఫోన్ స్తంభాలే హైమాస్ విద్యుత్ పోల్
06-08-2026 10:04 AM
బోథ్, ఆగస్టు 6 ( విజయక్రాంతి):మండల కేంద్రంలో హాయ్ మాస్ లైట్ ల ఏర్పాటు జోరుగా సాగుతున్నది. హైమాస్ లైట్ లో ఏర్పాటు గ్రామాలతో పాటు మండలాల్లో సైతం విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఏర్పాటు చేయడంలో గుత్తేదారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. హైమాస్ లైట్ ల ఏర్పాటు లాభ సాటిగా ఉండడంతో మరింత డబ్బు మిగిలాలన్నా దురాశతో కొంతమంది స్తంభాలకు గద్దెలు నిర్మించకపోగా పంచాయతీల వారు నిర్వహణ సైతం విస్మరిస్తున్నారు. మండల కేంద్రంలో ని నూతన కాలనీలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న టెలిఫోన్ స్తంభాలను హైమాస్తంభంగా మార్చడం జరిగింది. దీన్ని చూసిన వారంతా నివ్వెరపోతున్నారు. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వ ఆస్తిని విద్యుత్ స్తంభంగా మార్చడం చర్చనీయాంశంగా మారింది.






