6 August, 2026 | 2:33 AM

అనలాగ్ పనీర్‌పై బ్యాన్

06-08-2026 01:55 AM
  1. నిషేధం విధించిన మహారాష్ట్ర ప్రభుత్వం 
  2. ఉల్లంఘిస్తే ఆరు నెలల జైలు, లక్ష జరిమానా

ముంబై, ఆగస్టు 5: అనలాగ్ పనీర్ తయారీ, విక్రయాలపై మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిషేధం విధిం చింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే గరిష్ఠంగా ఆరు నెలల జైలు శిక్షతోపాటు రూ.లక్ష వరకు జరిమానా విధించాలని ఆ రాష్ట్ర ఫుడ్ సెఫ్టీ కమిషనర్ తుకారాం ముండే ఉత్తర్వులు జారీ చేయడంతో అనలాగ్ పనీర్, కల్తీ పాల ఉత్పత్తుల విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. నకిలీ పాలు, కల్తీ పాల ఉత్పత్తుల విక్రయాన్ని అరికట్టే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తున్నది.

అయితే, ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ తర్వాత అనలాగ్ పనీర్‌ను నిషేధించిన రెండో రాష్ట్రంగా మహారాష్ట్ర నిలవడం విశేషం. మహారాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అథారిటీ జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం ఆ రాష్ట్రంలో అనలాగ్ పనీర్ తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, రవాణా, విక్రయాలు, పంపిణీ వంటి కార్యకలాపాలను ఇకపై నేరంగా పరిగణిస్తారు. కాగా ఆహార భద్రత, ప్రమాణాల చట్టం---2006 ప్రకారం నేరం తీవ్రత ఎక్కువగా ఉన్న సందర్భంలో శిక్షను కూడా కఠినతరం చేయడం గమనార్హం.

కల్తీ పనీర్ కారణంగా ఎవరైనా మరణిస్తే జీవిత ఖైదుతోపాటు రూ.10 లక్షల వరకు జరిమానా విధించేలా చట్టంలో నిబంధనలు పొందుపరచడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. అనలాగ్ పనీర్ అంశం గత ఏడాది మహారాష్ట్ర శాసనసభను కుదిపేసింది. అనలాగ్ పనీర్‌పై పూర్తిస్థాయి నిషేధం విధించాలని శాసనసభ్యులు గతంలో డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కల్తీ పాల ఉత్పత్తులపై చర్యలను ముమ్మరం చేశారు.

కృత్రిమ పాలు, పనీర్ తయారీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని మే నెల నుంచి మహారాష్ట్రలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా వరుసగా దాడులు నిర్వహించి, పెద్ద మొత్తంలో ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సుమారు 1,400 కిలోల పనీర్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు 1,800 కిలోల కొవ్వు తొలగించిన పాల పొడి, 400 కిలోల గ్లిజరాల్ మోనోస్టియరేట్ పొడి, 718 లీటర్ల పామాయిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

అనలాగ్ పనీర్ అంటే ఏమిటి? 

భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ నిబంధనల ప్రకారం అనలాగ్ పనీర్ తయారీకి, విక్రయాలకు అనుమతి ఉంది. అయితే దానిని అనలాగ్ పనీర్‌గా స్పష్టంగా వెల్లడించడంతో పాటు, సరైన వివరాలతో లేబుల్ చేసి మాత్రమే విక్రయిం చాలి. స్వచ్ఛమైన పాలతో చేసిన పనీర్‌గా పేర్కొనడం, వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తూ విక్రయించడం మాత్రం నేరం. అనలాగ్ పనీర్‌ను సాధారణంగా స్వచ్ఛమైన పనీర్‌కు ప్రత్యామ్నాయంగా వాడతారు.

పెద్ద మొత్తంలో పనీర్ అవసరమైన సందర్భాల్లో, రెస్టారెంట్లు, హోటళ్లలో అనలాగ్ పనీర్‌ను ఎక్కువగా వాడతారు. దీన్ని పాల కొవ్వుకు బదులుగా నాన్ పదార్థాలు, వృక్షాల నుంచి సేకరించిన కొవ్వు (పామాయిల్) వంటి పదార్థాలను వాడి తయారు చేస్తారు. ఇది స్వచ్ఛమైన పనీర్‌ను పోలి ఉన్నప్పటికీ, పోషక్ విలువలు తక్కువగా ఉంటాయి. ఇది చౌకగా లభిస్తుంది. అయితే, ఈ క్రమంలో కొందరు సింథటిక్, ఇతర రసాయనాలను వాడి కల్తీ పనీర్ తయారు చేయడం, వాటిని స్వచ్ఛమైన పనీర్ పేరిట విక్రయాలు జరపడం లాంటి అక్రమాలు జరుగుతున్నాయి.

కల్తీ పనీర్‌ను గుర్తించడం ఎలా? 

స్వచ్ఛమైన పనీర్‌లో పాల ప్రోటీన్ ప్రధా న పోషకం. కానీ, అనలాగ్ పనీర్‌లో పాల ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. అనలాగ్ పనీర్‌లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటా యి. పనీర్‌కు గట్టిదనం, ఆకారం రావడానికి పిండి పదార్థాలను ఉపయోగిస్తారు. అందు కే ఇది పాల పనీర్‌తో పోలిస్తే భిన్నమైన పోషకాలను కలిగి ఉంటుంది. స్వచ్ఛమైన పనీర్ మృదువుగా ఉంటుంది. అనలాగ్ పనీర్ రబ్బరు మాదిరిగా సాగుతున్నట్టు ఉంటుంది. దీన్ని నమలడానికి ఎక్కువ సమయం పడుతుంది. 

కల్తీ పనీర్‌ను వేడి చేసినప్పుడు వెంటనే కరిగిపోయి, ఆయిల్ వంటి పదార్థాలు బయటపడతాయి. కానీ, స్వచ్ఛమైన పనీర్‌ను వేడి చేస్తే కొంత నీటి వంటి ద్రవ పదార్థం కనిపించినా, పూర్తిగా ఆకారం మారదు. స్వచ్ఛమైన పనీర్ కొంతవరకు పాల రుచిని కలిగి ఉంటుంది. కానీ, అనలాగ్ పనీర్‌లో అలాం టి రుచి చాలా తక్కువగా కనిపిస్తుంది.

పూర్తిగా రసాయనాలతో తయారు చేసిన పనీర్‌లో పాల రుచి అసలే ఉండకపోవచ్చు. అంతేకాదు, పనీర్ ముక్కలు వివిధ రంగుల్లో ఉంటే అనుమానించాల్సిందే. వీటన్నింటి కంటే ముఖ్యంగా పనీర్‌ను కొనుగోలు చేసినప్పుడు దాని తయారీకి వినియోగించిన పదార్థాల జాబితాను క్షుణ్నంగా పరిశీలించడం ఉత్తమమైన మార్గం.

పోషకాల గని పనీర్

కొవిడ్ విలయం తర్వాత ప్రజల్లో ఆ హారం, ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. సహజ ఉత్పత్తులు, ఆరోగ్యానికి మేలు చేసే ఆహా ర పదార్థాలను తినడానికి ప్రజలు ఎక్కు వ ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే గత కొంతకాలంగా పనీర్‌కు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే పనీ ర్ కల్తీ కూడా ఎక్కువైంది. వాస్తవానికి భా రత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికా ర సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిబంధనల ప్రకారం పనీర్‌ను స్వచ్ఛమైన పాలతోనే తయారు చేయాలి.

అందులో కొవ్వు ప దార్థాలు లేదా రసాయనాలను కలపడం నేరం. స్వచ్ఛమైన పాలతో తయారు చేసి న పనీర్ ఒక పోషకాల గని లాంటిది. అం దులో ప్రొటీన్లు, విటమిన్లు, కార్బొహైడే ట్లు ఉంటాయి. దాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.

హైదరాబాద్‌లోనూ కల్తీ..

కల్తీ ఆహార పదార్థాలు, ముఖ్యంగా క ల్తీ పనీర్ తయారీ, విక్రయం అనేది ఒక్క మ హారాష్ట్రకు పరిమితమైన సమస్య కా దు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాం తాలను ఈ సమస్య తీవ్ర ంగా వెం టాడుతున్న విషయం తెలిసిందే. మన దేశంలో పనీర్‌కు డిమాండ్ ఎక్కువ. ఈ నేపథ్యంలో కొందరు అక్రమార్కులు కా సుల కక్కుర్తితో స్వచ్ఛమైన పనీర్‌కు బదులుగా కల్తీ పనీర్‌ను విక్రయించడం సర్వ సాధారణంగా మారిపోయింది.

ఈ క్రమ ంలోనే కల్తీ పాల ఉత్పత్తులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నా యి. ఇటీవల హైదరాబాద్‌లోనూ 825 కిలోల కల్తీ పనీర్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసు లు స్వాధీనం చేసుకున్న విషయం విదిత మే. 45 దుకాణా లు, 8 తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడు లు చేయగా, ఈ కల్తీ బాగోతం బట్టబయలైంది.

అంతేకాకుండా తయారీ తేదీ, ఎక్స్ పైరీ తేదీలను తారుమా రు చేసి విక్రయా లు జరుపుతున్న వైనం కలకలం రేపింది. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అనలాగ్ పనీర్ అంటే ఏమిటి? స్వచ్ఛమైన పనీర్‌కు, అనలాగ్ పనీర్‌కు మధ్య ఉన్న వ్య త్యాసాలు ఏమిటన్న అంశంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది.