6 August, 2026 | 3:14 AM

ఎంట్రీ.. ఎగ్జిట్ వరస్ట్!

06-08-2026 02:10 AM

* గతుకుల మయం.. హనుమకొండ ఆర్టీసీ బస్టాండ్

మహబూబాబాద్, (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో హనుమకొండ లోని ప్రధాన ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ అధ్వానంగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి కాక ఇతర రాష్ట్రాలకు  వందల బస్సులు నడిచే హనుమకొండ ఆర్టీసీ బస్టాండ్ లో బస్సులు ప్రవేశించే మార్గం (ఎంట్రీ), బయటకు వెళ్లే మార్గం (ఎగ్జిట్)లో పెద్ద పెద్ద గోతులు ఏర్పడి బస్సుల రాక పోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. గోతుల వల్ల లోనికి వచ్చే సమయంలో అటూ ఇటూగా ఊగుతూ.. తూగుతూ వెళుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ లోనే ఆవరణ పరిస్థితి అధ్వాన్నంగా మారిందని, ఇక వర్షా కాలంలో గోతుల్లో నీరు నిలిచి మరింత ఇబ్బంది కలిగిస్తోందని వాపోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధికి వెంటనే చర్యలు చేపట్టాలని ప్రయాణికులు, ఆర్టీసీ డ్రైవర్లు కోరుతున్నారు.