5 August, 2026 | 1:54 AM

గంగారంలో తల్లిపాల వారోత్సవాలు

05-08-2026 01:05 AM

మహేశ్వరం, ఆగస్టు 4 (విజయక్రాంతి): మహేశ్వరం మండలం గంగారం గ్రామ పంచాయతీ అంగన్వాడీ కేంద్రంలో ’తల్లిపాలు వారోత్సవాలు’ (ఆగస్టు 1 నుండి 7 వరకు) ఘనంగా కొనసాగుతున్నాయి.

ఈ సందర్భంగా సర్పంచ్ దేవేందర్ నాయక్, అంగన్వాడీ మండల సూపర్వైజర్ విద్యావతి మాట్లాడుతూ... అమ్మపాలు అమృతంతో సమానమని, శిశువుల దీర్ఘకాలిక ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తి పెంపునకు ఇవి ఎంతో అవసరమని తెలిపారు. పుట్టిన మొదటి గంటలోనే బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం ద్వారా నవజాత శిశు మరణాలను అరికట్టవచ్చని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేందర్, వార్డు సభ్యులు ఎం. మోహన్, ఎం. రవి, ఎం. శ్రీనివాస్, ఎం. భాస్కర్, అంగన్వాడీ టీచర్ అనిత, పాఠశాల ఉపాధ్యాయుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు.