5 August, 2026 | 1:53 AM

పచ్చని భవిష్యత్తు కోసం వన మహోత్సవం

05-08-2026 01:05 AM

పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

ఉప్పల్, ఆగస్టు 4 విజయ క్రాంతి పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుదల లక్ష్యంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి పచ్చని తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంఎంసీ కమిషనర్ విజయ్ కృష్ణారెడ్డి (ఐఏఎస్), జోనల్ కమిషనర్ రాధికా గుప్తా (ఐఏఎస్)తో కలిసి మొక్కలు నాటిన ఎమ్మెల్యే, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో చెట్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ,

క్కో వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షిస్తే భావితరాలకు ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించగలం. మొక్కలు నాటడం ఒక బాధ్యత అయితే, వాటిని పెంచి పరిరక్షించడం మరింత గొప్ప బాధ్యత అని అన్నారు.ఎంఎంసీ కమిషనర్ విజయ్ కృష్ణారెడ్డి, జోనల్ కమిషనర్ రాధికా గుప్తా మాట్లాడుతూ నగరాన్ని మరింత హరితవనంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని కోరారు. విస్తృత స్థాయిలో మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.