4 August, 2026 | 6:12 PM

పలు గ్రామాల్లో తల్లిపాల వారోత్సవాలు

04-08-2026 05:10 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని బంజర తండా, చినుర్ గ్రామాలలో తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం సర్పంచుల ధరావత్ సురేష్, మురళి గౌడ్ల అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. చినూరు గ్రామంలో ఎల్లారెడ్డి డిఎల్పిఓ సురేందర్ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎల్పిఓ సురేందర్ చిన్నారులకు పాలు తాగించారు. అనంతరం డిఎల్పిఓ సురేందర్ మాట్లాడుతూ... చినూరు గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా నీరు నిల్వ ఉన్న ప్రదేశాలలో ఆయిల్ బాల్స్ వేయాలని తెలిపారు.

 ప్రాథమిక ఉన్నత పాఠశాల మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. బంజారా తండా గ్రామ సర్పంచ్ ధరావత్ సురేష్ మాట్లాడుతూ... శిశువు పుట్టిన వెంటనే గంటలోపు ముర్రిపాలు తాగించాలని శిశువు మరణాలు తగ్గుతాయని నినాదం ఇచ్చారు. శిశువు పుట్టినరోజు నుండి ఆరు నెలల వరకు తల్లిపాలు అమృతమని తల్లిపాలు, ముర్రిపాలు పిండి పారబోయకుండా శిశువుకు తాగించాలని సూచించారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న బాలమృతం పౌష్టికాహారని గర్భిణీలకు అందజేయాలని తెలిపారు.