16 June, 2026 | 12:29 PM

వేములవాడ మండలంలో తల్లిపాల వారోత్సవాలు

05-08-2025 11:18 PM

వేములవాడ టౌన్,(విజయక్రాంతి): వేములవాడ అర్బన్ మండలం చంద్రగిరి, వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట -2, ఫాజుల్ నగర్-2, తూర్కశి నగర్ లో ఐసిడిఎస్, సిడిపిఓ సౌందర్య ఆదేశాల మేరకు సూపర్వైజర్లు అంజమ్మ, సరిత ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీ నుండి ఏడవ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాలు అంగన్వాడీ టీచర్ల పర్యవేక్షణలో జరిగినవి. తల్లిపాలు వారోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలోని తల్లులు, పాలిచ్చే స్త్రీలు, తల్లిపాల ప్రాముఖ్యతను చెప్పడం కోలో స్ట్రమ్ మొదటి పాలు యొక్క వివరణ మరియు దానిలో విటమిన్లు ఏటిఈకే మరియు రోగ నిరోధక శక్తి కోసం ప్రతి రోదకాల సమృద్ధిగా ఉంటుంది. శిశువులకు మొదటి ఆరు నెలలు నీరు లేదా ఇతర ద్రవాలు ఇవ్వకుండా కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచన.