calender_icon.png 6 August, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల సందడి

05-08-2025 11:21:08 PM

వేములవాడ టౌన్,(విజయక్రాంతి): దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయంలో మంగళవారం రోజున భక్తుల సందడి నెలకొంది. సోమవారం రోజున శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు మంగళవారం వేకువజాము నుండి బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు తయారు చేసుకొని, నెత్తిన బోనంతో, కుటుంబ సమేతంగా, డప్పు చప్పుల మధ్య, శివసత్తుల నృత్యాల మధ్య ఆడంబరంగా బోనాలను బద్ది పోచమ్మ అమ్మవారికి సమర్పించారు. భక్తులు తమ పిల్లాపాపలను, తమ పాడి పంటలను, చల్లంగా చూడాలని, తమ కోర్కెలు నెరవేరాలని ఆ అమ్మవారిని వేడుకున్నారు. బద్ది పోచమ్మ ఆలయ ప్రాంగణంలో భక్తులతో సందడి నెలకొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేసినారు.