29 May, 2026 | 2:53 AM

బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం

29-05-2026 12:59 AM

కోదాడ, మే 28: కాపుగల్లు టూ గణపవరం గ్రామాల మధ్యలో అంతర్ గంగ వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులను గణపవరం మండల పార్టీ అధ్యక్షుడు వరప్రసాద్ గణపవరం సర్పంచ్ స్నేహ దుర్గయ్య, గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి సహాయ సహకారాలతో సీఆర్‌ఆర్ నిధులు రూ.1.50 కోట్ల తో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టినట్లు వివరించారు. ఈ బ్రిడ్జితో రైతులకు ఉపయో గంగా ఉంటుందన్నారు.

గ్రామాభివృద్ధికి తీవ్రముగా కృషి చేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే పద్మావ తిరెడ్డి బాగా సహకరిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాపుగల్లు ఉప స ర్పంచ్ తొండపు సతీష్, గణపవరం దేవాల య చైర్మన్ వరహాల రెడ్డి, ఇర్లా శ్రీనివాసరెడ్డి, చింతా సత్యనారాయణరెడ్డి, అమరబోయిన రవి, జాబిశెట్టి శ్రీనివాసరావు, కృష్ణయ్య,  రెడ్డి,  లక్ష్మయ్య, కృష్ణయ్య, మాజీ సర్పంచ్ వెంకట్రామిరెడ్డి, గురవయ్య, నాగప్రసాద్,  ఉప సర్పంచ్ కోటేశ్వరరావు, బండి చిన కోటయ్య,  నాగేశ్వరరావు,  పాల్గొన్నారు.