గాలివానకు కూలిన ఇంటిపై కప్పు
29-05-2026 01:01 AM
మఠంపల్లి, మే 28: మండలంలోని లాలి తండా గ్రామ పంచాయతీ పరిధిలో గురువారం కురిసిన భారీ వర్షం ఈదురుగాలు లకు ఓ కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. గ్రామానికి చెందిన తాళ్లూరి వీర బ్రహ్మచారి నివాస గృహంపై ఉన్న రేకుల కప్పు ఒక్కసారిగా బలమైన గాలులకు తట్టుకోలేక ఎగిరిపోయాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు.
అదృష్టవశాత్తూ వారు స్వల్ప గాయాలతో బయటపడగా, పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఇంటి సామగ్రి, గృహోపకరణాలు, రేకులు పూర్తిగా దెబ్బతిని ఆస్తి నష్టం సంభవించినట్లు గ్రామస్థులు తెలిపారు. ఘటన విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ బాలు నాయక్, వార్డు సభ్యులు వెం టనే బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధై ర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.






