వీర్ సావర్కర్ పోరాటం స్ఫూర్తిదాయకం!
29-05-2026 12:58 AM
వీహెచ్‌పీ నేతలు
హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి): కాచిగూడ వీర సావర్కర్ చౌరస్తాలో విశ్వహిం దూ పరిషత్ ధర్మచార్య సంపర్క్ విభాగం ఆధ్వర్యంలో గురువారం వీర సావర్కర్ జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటా నికి పూలమాలవేసి నివా ళులర్పించారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ ధర్మాచార్య సంపర్క్ ప్రముఖ్ బాలస్వామి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం వీర సావర్కర్ చేసిన త్యాగాలు, ధైర్యసాహసాలు యువతకు స్ఫూర్తి దాయకమన్నారు.
కార్యక్రమంలో ధర్మాచార్య సంపర్క సహ ప్రముక్ హరికిషన్ శర్మ, రాఘవేంద్ర, లక్ష్మణ్, స్వదేశీ జాగరణ మంచ్ ప్రాంత ప్రచార ప్రముక్ కేశవ్ సోనీ, భారతీ య జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంగమేశ్వర్, సంగారెడ్డి జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి జగన్, విపిన్ పాల్గొన్నారు.






