కల్లూరులో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు
తెలంగాణ సిద్ధాంతకర్తకు ఘన నివాళి
కల్లూరు,(విజయక్రాంతి): కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం కళాశాలలో ఇంటర్మీడియట్ అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ సాధనలో చేసిన కృషిని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు.ఈ కార్యక్రమంలో కల్లూరు మున్సిపాలిటీ చైర్మన్ ధరవత్ మోహన్ నాయక్,వైస్ చైర్మన్ శీలం కోటేశ్వరి కృష్ణారెడ్డి, కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్,15వ వార్డు కౌన్సిలర్ యాసా నాగమణి శ్రీకాంత్, కల్లూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోట్రు అర్జున్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ బాజీ,బొల్లం ఉపేందర్ అలాగే కళాశాల ప్రిన్సిపాల్ వేముల శేఖర్, అధ్యాపకులు శ్రీనివాసరావు, షకీలా భాను,పుల్లారావు, వరలక్ష్మి,రంజిత్,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.






