16 June, 2026 | 1:48 AM

విద్యతోనే ఉజ్వల భవిష్యత్

16-06-2026 12:38 AM

రాజాపూర్ జూన్ 15: విద్యతోనే దేశ అభివృద్ధితో పాటు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పీఎంశ్రీ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో విద్యార్థులకు ప్రధానో పాధ్యాయులు సయ్యద్ ఇబ్రహీంతో కలిసి పాఠ్యపుస్తకాలను అందజేశారు.

గత సంవత్సరం 10వ తరగతిలో ఫలితాలలో ఉత్తమ ఉత్తీర్ణ శాతం సాధించినందుకు, పాఠశాల సబ్జెక్టు వారిగా ఉపాధ్యాయులను అభినందించారు. ఈ సంవత్సరం కూడా మంచిగా రిజల్ట్ రావడానికి అందరూ కృషి చేయవలసిందిగా కోరారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు బదిలీ సర్టిఫికెట్ పంపిణీ చేశారు. ఈ విద్యా సంవత్సరంలో కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించాలని  అన్ని రంగాలలో రాణించాలని ఆకాంక్షించారు.  ఉపాధ్యాయులు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.