ఆదివాసీ కాంగ్రెస్ బస్ యాత్ర
పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): గిరిజనులకు ఎస్టీ రిజర్వేషన్లు కల్పించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మాజీ ప్రధా ని స్వర్గీయ ఇందిరా గాంధీ చేసిన కృషిని ప్రజలకు చాటిచెప్పేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బస్ యాత్రను నిర్వహించనున్నట్లు పీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ ప్రకటించింది. ఆదివాసీ కాంగ్రె స్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అధ్యక్షతన సోమవారం జరిగిన ఈ సమావేశానికి మహేష్‌కుమార్‌గౌడ్ మాట్లాడారు. 1976 లో లంబాడీల సామాజిక, ఆర్థిక పరిస్థితులను స్వయంగా అధ్యయనం చేసిన ఇందిరా గాంధీ, వారి అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఇదిలా ఉంటే జాతీయ స్థాయి కరాటే ఫైటర్స్‌కు పీసీసీ చీఫ్ అభినందనలు తెలిపారు. ఈ నెల 4 నుంచి 7 వరకు డెహ్రాడూన్ ఉత్తరాఖండ్‌లో కియో ఆధ్వర్యంలో నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2026 నిర్వహించగా తెలంగాణ నుంచి సబ్ జూనియర్, క్యారెట్, జూనియర్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొని 2 గోల్డ్, 4 సిల్వర్, 5 బ్రాంచ్ మెడల్స్ సాధించినట్లు స్టేట్ జనరల్ సెక్రెటరీ మల్యాల రామస్వామి తెలిపారు. విద్యార్థులను, కోచ్‌లను తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్‌గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు.






