22 June, 2026 | 7:44 PM

Breaking News

విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్   •   భూముల సర్వేను పక్క చేయాలి   •   ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి   •   గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి: టిపిటిఎఫ్   •   వీబీజీ రాంజీ చట్టంతో కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి   •   పెన్షనర్స్ సమస్యల పట్ల ప్రభుత్వం అలసత్వం విడాలి   •   అనురాగ్ లో వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధిపై డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్   •   డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన   •   దమ్మపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్   •   శభాష్... సర్పంచ్ సాబ్   •  

రోజ్ వాటర్‌తోకాంతివంతంగా..

23-03-2025 12:00 AM

అందంగా కనిపించాలంటే చర్మ సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ చర్మం మెరుస్తూ ఉండాలి. ఇందుకు చాలామంది ఖరీదైన క్రీములు వాడతారు. కాని, ఇంట్లో ఉండే రోజ్ వాటర్‌తో అందంగా మెరిసిపోవచ్చు. 

ఎండబారిన పడినప్పుడు చర్మం వేడిగా, మంటగా ఉంటుంది. అలాంటప్పుడు రోజ్ వాటర్‌ను స్ప్రేగా ఉపయోగిస్తూ ఈ అసౌకర్యాన్ని తగ్గించుకోవచ్చు.

ఇది మంచి మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు ముఖానికి రోజ్ వాటర్ రాసుకోవడం చాలా మంచిది. దీనివల్ల చర్మం తాజాగా, మెరుస్తూ ఉంటుంది.

స్కిన్ టోన్‌ను సాఫ్ట్‌గా మారుస్తుంది. రాత్రి పడుకునే ముందు ముఖానికి రోజ్ వాటర్ రాసుకోవడం చాలా మంచిది. దీనివల్ల చర్మం తాజాగా, మెరుస్తూ ఉంటుంది. 

నిత్యం రోజ్ వాటర్ వాడటం వల్ల వృద్ధాప్య ఛాయలను త్వరగా దూరం చేసుకోవచ్చు. ఇందులో యాంటీ-ఆక్సి డెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ కారణంగా కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. 

పెర్ఫ్యూమ్ అంటే అంతగా ఇష్టపడని వారు రోజ్ వాటర్‌ను మణికట్టుకు అప్లై చేసుకోవచ్చు. ఇది ఆహ్లాదకంగా ఉంటుంది.