అనురాగ్ లో వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధిపై డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్
ఘట్ కేసర్,(విజయక్రాంతి): అనురాగ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్‌లోని ప్లాంట్ పాథాలజీ విభాగం ఆధ్వర్యంలో పుట్టగొడుగుల సాగు ద్వారా వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధి అనే అంశంపై మూడు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను నిర్వహించారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న బోధనా సిబ్బంది, విద్యార్థులు పారిశ్రామికవేత్తలకు పుట్టగొడుగుల సాగు పద్ధతులు, వ్యాపార అవకాశాలు, పోషక, ఔషధ విలువలు, తెగుళ్ల గుర్తింపు నివారణ చర్యలు, కోత అనంతరం తీస్కోవాల్సిన జాగ్రత్తలు, ప్రాసెసింగ్ విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ వంటి అంశాలపై పుట్టగొడుగుల సాగులో అనుభవం కలిగిన శాస్త్రవేత్తలు పారిశ్రామికవేత్తలచే అవగాహన కల్పించారు.
ఈకార్యక్రమానికి వక్తలుగా వహించిన పుట్టగొడుగుల సాగులో నిపుణులు అయినటువంటి డాక్టర్ ఎం. పి. ఠాకూర్ (ప్రొఫెసర్, ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యా, రాయిపూర్ ) మాట్లాడుతూ పుట్టగొడుగుల సాగులో ఉన్న అవకాశాలను వివరిస్తూ, నాణ్యమైన పుట్టగొడుగుల స్పాన్ కు పెరుగుతున్న డిమాండ్ ను ప్రస్థావించారు. యువత స్పాన్ ఉత్పత్తి రంగాన్ని ఒక మంచి వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధి అవకాశంగా స్వీకరించాలని ప్రోత్సహించారు.






