22 June, 2026 | 8:17 PM

దమ్మపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్

22-06-2026 07:15 PM

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన పైడి, దోడాకుల

దమ్మపేట,(విజయక్రాంతి): అశ్వరావుపేట నియోజకవర్గం లో బి ఆర్ ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది.  బి ఆర్ ఎస్ పార్టీలో కీలక నేతలుగా ఉన్న దమ్మపేట మండలానికి చెందిన మాజీ జడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు, దొడ్డకుల రాజేశ్వరరావు సోమవారం బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వారిద్దరూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు దమ్మపేట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ రమేష్ కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. పైడి వెంకటేశ్వరరావు, దొడ్డాకుల రాజేశ్వరరావు లు దమ్మపేట మండలంలో బలమైన నాయకులుగా ఉన్నారు.

మండల క్రియాశీలక రాజకీయాల్లో పైడి వెంకటేశ్వరరావు తనదైన ముద్ర వేసుకున్నారు. గత 40 సంవత్సరాలు కాలంలో పైడి వెంకటేశ్వరరావు పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా, పదవులు ద్వారా దమ్మపేట మండల ప్రజలకు దగ్గరగా ఉన్నారు. అలాగే దొడ్డాకుల రాజేశ్వరరావు కూడా దమ్మపేట మండలంలో బలమైన నాయకుడుగా గుర్తింపు పొందారు. ఇకపై తుమ్మల అడుగుజాడల్లో నడుస్తామనీ, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన పైడి వెంకటేశ్వరరావు, దొడ్డకుల రాజేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.