శభాష్... సర్పంచ్ సాబ్
22-06-2026 07:05 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని సిద్ధిలకుంట ప్రభుత్వ పాఠశాలలో బడిబాటల చేరిన విద్యార్థులకు గ్రామ సర్పంచ్ నూతుల సతీష్ రెడ్డి చేయూతనందించారు. పాఠశాల విద్యార్థులకు దగ్గరుండి సామూహిక అక్షరాభ్యాసం చేయించి పుస్తకాలు పెన్నులు స్కూల్ బ్యాగులు అందించారు. 15వేల విలువచేసే ఆట వస్తువులను కూడా అందించి ప్రభుత్వ బడికి తన ఉదాహరణ చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పరమేశ్వర్ ఉపాధ్యాయులు ఉన్నారు.






