2 June, 2026 | 2:44 AM

నిరుపేదల కళ్లల్లో ఆనందమే ప్రభుత్వ లక్ష్యం

02-06-2026 12:51 AM
  1. ఇల్లు లేని ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండడమే లక్ష్యం 
  2. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

బోయినపల్లి: జూన్ 1 (విజయ క్రాంతి): ప్రతి పేదవాడికి ఇల్లు లేని వారికి సొంత ఇల్లు మం జూరు చేసి నిర్మాణం చేసి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ, గుండన్నపల్లి, బోయినపల్లి, కోరెం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ గరీమ అగర్వాల్ కలిసి ఇందిరమ్మ ఇలను ప్రారంభించారు.

అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ పేదవారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సంక్షేమ ప థకాలు ఇలాంటి పక్షపాతం లేకుండా అర్హులైన వారందరికీ ఇస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాలకు చొప్పదండి శాసన సభ్యులు మేడిపల్లి సత్యం , రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారుల నూతన గృహాలను ప్రారంభించారు.

గ్రామాల్లో లబ్ధిదారుల ఆనందోత్సాహాల మధ్య జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్,ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గృహాలను ప్రారంభించడంతో పాటు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై సం దేశం ఇచ్చారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి గృహాలను పరిశీలించి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భీమా జయశీల, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మనబోయిన సునీల్ యాదవ్ సర్పంచులు శ్రీనివాస్, నల్లమోహన్, సెస్ డైరెక్టర్ సుధాకర్,,డీఈలు, ఏ ఈ, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్థులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు అందడంతో తమ కుటుంబాలకు శాశ్వత నివాసం కలిగిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.