23 March, 2026 | 9:42 AM

డాక్టర్ రెడ్డీస్ చేతికి బ్రిటన్ కంపెనీ ఎన్‌ఆర్‌టీ వ్యాపారం

27-06-2024 01:40 AM

ముంబై, జూన్ 26: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్ బ్రిటన్ హెల్త్‌కేర్ కంపెనీ హలియోన్‌కు చెందిన యూఎస్ వెలుపలి నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (ఎన్‌ఆర్‌టీ) వ్యాపారాన్ని కొనుగోలు చేయనుంది. 500 మిలియన్ పౌండ్లకు డాక్టర్ రెడ్డీస్ స్విట్జర్లాండ్ యూనిట్ కొంటున్నదని హలియోన్ తెలిపింది. నికోటినెల్ బ్రాండ్ నికోటిన్ గమ్, ప్యాచెస్‌ను విక్రయించే ఈ వ్యాపారం గత ఏడాది 217 మిలియన్ పౌండ్ల టర్నోవర్ సాధించింది.