15 August, 2026 | 11:32 AM

సీఎం విజయ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో త్రిష

15-08-2026 10:36 AM

చెన్నై: చెన్నైలో జరిగిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తమిళనాడు ముఖ్యమంత్రి(Chief Minister of Tamil Nadu) సి. జోసెఫ్ విజయ్ తల్లిదండ్రుల పక్కన నటి త్రిష(Trisha) కృష్ణన్ కూర్చుని కనిపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఫోర్ట్ సెయింట్ జార్జ్ వద్ద మొదటిసారిగా జాతీయ జెండాను ఆవిష్కరించారు.

తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మాట్లాడుతూ... "తమను బానిసల్లా చూస్తున్నారని ప్రజలు గ్రహించినప్పుడు, వారిలో ఐక్యతా భావం ఏర్పడుతుంది. అందరూ ఏకమవ్వడం మొదలుపెడతారు. కులపరమైన అడ్డంకులు తొలగిపోతాయి. కుల, మత భేదాలు సమసిపోయి అందరూ ఏకమైనప్పుడే అది నిజమైన స్వేచ్ఛ అవుతుంది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు పూర్తయ్యాయి. ఈ మూడు నెలల్లో రైతులు తీసుకున్న పంట రుణాలు మాఫీ చేయబడ్డాయి. 717 టాస్మాక్ (TASMAC) మద్యం దుకాణాలు మూసివేయబడ్డాయి." అని పేర్కొన్నారు. సీఎం విజయ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో త్రిష ముందు వరుసలో కూర్చున్న  వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.