26 April, 2026 | 4:56 AM

టాటా సన్స్ చైర్మన్‌కు బ్రిటన్ నైట్‌హుడ్ ప్రకటన

15-02-2025 12:59 AM

లండన్: టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కు అరుదైన గౌరవం లభించింది. బ్రిటన్ ప్రభుత్వం ఆయనకు గౌరవ నైట్‌హుడ్ పురస్కారాన్ని ప్రకటించింది. యూకే- భారత్ వ్యాపార బంధానికి ఆయన చేస్తున్న సేవలకు గాను ఈ పురస్కారం ప్రదానం చేయనున్నట్లు వెల్లడించింది.

పురస్కారం లభించడంపై చంద్రశేఖరన్ స్పందించారు. పురస్కారం లభించడంపై ఎంతో గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. కింగ్ ఛార్లెస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తాము  యూకేతో పటిష్ఠమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నామన్నారు.