28 June, 2026 | 3:53 PM

Breaking News

పల్స్ పోలియో చుక్కలు వేసిన బోధన్ ఆర్డీవో ఎం.విజయ కుమారి   •   పీవీ నరసింహారావుకు ఘన నివాళి   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •  

అక్కను వేధిస్తున్నాడని బావను చంపారు

26-09-2024 01:37 AM
  1. హత్య కేసులో బావ మరుదుల అరెస్ట్ 
  2. వివరాలు వెల్లడించిన సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్

కార్వాన్, సెప్టెంబర్ 25: అక్కను వేధిస్తున్నాడని ఇద్దరు బావమరుదులు బావను హతమార్చారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను గోల్కొండ అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ బుధవారం వివరాలు వెల్లడిం చారు. గోల్కొండ ప్రాంతానికి చెందిన అబ్దుల్ ఖదీర్ తన కూతురును ఆసిఫ్‌నగర్‌కు చెందిన మహ్మద్ సలీంకు 16 ఏళ్ల క్రితం వివాహం చేశాడు. కొన్నాళ్ల నుంచి సలీం భార్యపై వేధింపులకు పాల్పడుతున్నాడు.

దీంతో భార్య పుట్టింటికి వచ్చింది. ఆదివారం భార్యను తిరిగి తీసుకెళ్లేందుకు సలీం అత్తగారింటికి వచ్చాడు. ఇదే విషయంపై బావమరుదులైన ఆమోదు, రాహెద్ స్పందించి బావ సలీంతో గొడవకు దిగారు. సలీంపై కత్తితో దాడి చేసి చంపేశారు. నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.