నేడు బీఆర్‌ఎస్ కరీంనగర్ బంద్
భారీ బందోబస్తు
కరీంనగర్, మే8(విజయక్రాంతి):కరీంనగర్లో బీజేపీ, బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం, సవాళ్లు చిలికిచిలికి గాలివానలా మారి, దాడులకు దారితీశాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం కరీంనగర్ బంద్ కు బి ఆర్ ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి చేసి న వ్యాఖ్యలకు ప్రతిచర్యగా బీజేపీ శ్రేణులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్పు దాడి చేయడం, కారును ధ్వంసం చేయడం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ్ప డ్రగ్స్ ఆరోపణలు చేసిన బీజేపీ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఆ యన డ్రగ్ టెస్ట్కు రావాలని డిమాండ్ చేశా రు. కౌశిక్ రెడ్డి బండి సంజయ్ మాటలపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ‘బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ తీసుకుంటున్నా డు, టెస్టుకు రావాలి‘ అని సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన బీజేపీ కార్యకర్త లు కరీంనగర్లోని కౌశిక్రెడ్డి, గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయాలపై దాడి చేసి, అ ద్దాలు పగలగొట్టి, ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
దీనికి నిరసనగా బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు జి వి నేడు బంద్ కు పిలుపునిచ్చారు ఇది ఇలా ఉంటేప్రస్తుత పరిస్థితి:కరీంనగర్లో పోలీసులు భారీగా మోహరించారు.బీజేపీ కార్యక ర్తలు, బీఆర్‌ఎస్ నేతల మధ్య ఘర్షణల కారణంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దాడులకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని బీఆర్‌ఎస్, రక్షణ కల్పించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు
మాటల తూటాలు..
కరీంనగర్లో జ్యువెలరీ షాప్ దోపిడీ జరిగి వారం అయింది. దొంగలు దొరకడం మాట అటుంచితే ఈ ఘటన నేతల మాటల యుద్ధం నుండి దాడులకు దారితీసింది. ‘కరీంనగర్లో పోలీసులు చేతకానితనంతో వ్యవహరిస్తున్నారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు. నాపై దాడి చేయడానికి కుట్ర పన్నారు‘ అని పాడి కౌశిక్రెడ్డి ఆరోపించగా ‘కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నారని, వారి మాటలు వినే స్థితిలో ప్రజలు లేరు.
తెలంగాణలో శాంతిభద్రతల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదు‘ అనిబండి సంజయ్ ప్రతిదాడి చేశారు. ‘కరీంనగర్లో జ్యువెలరీ షాప్ దోపిడీ, ఇప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పు దాడి చూస్తుంటే రాష్ట్రంలో రౌడీరాజ్యం నడుస్తుందని అర్థమవుతోంది. డీజీపీ తక్షణమే చర్యలు తీసుకోవాలి‘ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.






