15 August, 2026 | 12:44 AM

ప్రేమ, అహింసకు రాయబారులుగా మారాలి

15-08-2026 12:01 AM

యుద్ధానికి ప్రేమే సరైన ప్రత్యామ్నాయం : దీపక్ జాన్

పంజాగుట్ట, ఆగస్టు 14(విజయక్రాంతి): యుద్ధానికి ప్రేమే సరైన ప్రత్యామ్నాయం అ ని క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మ న్, సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దీ పక్ జాన్ అన్నారు. సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన హీల్ ద వరల్ - వాయిసెస్ ఆఫ్ పీస్ కార్యక్రమాని కి ఆయన ముఖ్య ఆహ్వానితులుగా హాజరైమాట్లాడారు. యువత ప్రేమ, అహింసకు రాయబారులుగా మారాలని పిలుపునిచ్చా రు. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ తప్పకుండా శాంతి ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

యువత ప్రేమ గురించి మాట్లాడడమే కాకుండా దాన్ని ఆచరణలో చూపాలని పిలుపునిచ్చారు. షామ్షాబాద్ సైరో-మలబార్ కాథలిక్ ఆర్కీ-ఎపార్కీ తొలి మెట్రోపాలిటన్ ఆర్చ్బిషప్ మోస్ట్ రెవ. ప్రిన్స్ ఆంటోనీ పనెంగాడన్ మాట్లాడుతూ కళాశాల విద్యార్థుల సంస్కృతిక ప్రదర్శనలను అభినందించారు. దైవానికి దగ్గరవుతున్న కొద్ది మనశ్శాంతిని లోతుగా అనుభూతి చెందుతామన్నారు.

సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఉమా జోసెఫ్ మాట్లాడుతూ ప్రపంచానికి శాంతి గురించి మాట్లాడే వ్యక్తులు మాత్రమే కాదు, శాంతిని ఆచరించే వ్యక్తులు, శాంతికి ప్రతినిధులుగా నిలిచే యువత నేటి అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రివిన్షియల్ సుపీరియర్ రెవ. సిస్టర్ అల్ఫోన్సా వట్టోలీ, స్టీఫెన్ అండ్ యూత్ అలైవ్ సంస్థల ప్రతినిధులు, రిక్వెల్ ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్, లయో లా అకాడమీ, సెయింట్ పయస్ ఎక్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, సెయింట్ జోసెఫ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, సెయింట్ ఆన్స్ కాలేజ్ ఫర్ విమెన్, సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.