15 August, 2026 | 1:48 AM

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో 60 శాతం దళితులకు కేటాయించడం అభినందనీయం

15-08-2026 12:01 AM

మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ, వెంకటరత్నం బాబు

కోదాడ, ఆగస్టు 14 : కోదాడ పట్టణంలో పేదలకు మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 60 శాతం ఇళ్లను దళిత కుటుంబాలకే అందజేయడం అభినందనీయమని ము న్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వంటిపులి వెంకటేష్ లు అన్నారు. 34వ వార్డు కౌన్సిలర్ గంధం బా లేంద్ర, పాండు ఆధ్వర్యంలో శుక్రవారం బా లాజీ నగర్ లో లబ్ధిదారులకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించిన అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చిత్రపటాలకు లబ్ధిదారులతో కలిసి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేసిందన్నారు. మంత్రి, ఎమ్మెల్యే చొరవతోనే కోదాడలో వందలాది పేద కుటుంబాలకు ఇళ్లు దక్కాయని కొనియాడారు.నిరుపేద దళిత కుటుంబాలకు పెద్దపీ ట వేసిన మంత్రి ఉత్తమ్-పద్మావతి రెడ్డి దంపతులకు దళితులు జీవితాంతం రుణపడి ఉం టారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ ,మాలోతు చైతన్య నాయక్, ఏసు పాదం , జిల్లేపల్లి నాగేశ్వరరావు, వంటి పులి శ్రీనివాస్ , తదితరులు పాల్గొన్నారు.