calender_icon.png 11 November, 2025 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటు హక్కు వినియోగించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత

11-11-2025 07:48:13 AM

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్(Jubilee Hills by-election polling) ప్రారంభం అయింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత(ఓBRS Party candidate Maganti Sunitha) జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి గూడా శ్రీ కృష్ణ దేవరాయ వెల్ఫేర్ సెంటర్ బూత్ నెంబర్–290లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. జూబ్లీహిల్స్ ప్రజలంతా తప్పకుండా హక్కు వినియోగించుకోవాలని సునీత పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. 407 పోలింగ్ కేంద్రాలలో మొత్తం 4.01 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(BRS MLA Maganti Gopinath) మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ బీఆర్ఎస్ తరపున దివంగత మాగంటి గోపీనాథ్ భార్య సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంక దీపక్ రెడ్డి మధ్య ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహణకు 5 వేల మంది సిబ్బంది ఏర్పాటు చేశారు. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్ సజావుగా సాగేందుకు 1,761 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 800 మంది కేంద్ర బలగాలతో బందోబస్తు కోసం రంగంలోకి దింపారు. తొలిసారిగా ఎన్నికల నిర్వహణలో డ్రోన్ల వినియోగిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అధికారులు డ్రోన్ల ద్వారా మానిటరింగ్ చేయనున్నారు.