జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభం
హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్(Jubilee Hills by-election polling ) ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ జరగనుంది. ఈ నెల 14న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్లలో క్యూ కట్టారు. మహిళా ఓటర్లు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కట్టదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ వెల్లడించారు.




