11 April, 2026 | 4:29 AM

బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయం

06-02-2026 01:00 AM

రేపు తూప్రాన్‌కు హరీశ్‌రావు రాక   

మున్సిపల్ మాజీ చైర్మన్ బొంది రవీందర్‌గౌడ్

తూప్రాన్, ఫిబ్రవరి 5(విజయక్రాంతి): తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఈ నెల 7న హరీశ్‌రావు మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారని మాజీ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్‌గౌడ్ తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు అల్లాపూర్ చౌర స్తా నుంచి బయలుదేరి పెట్రోల్ పంపు నర్సాపూర్ చౌరస్తా సినిమా టాకీస్ రోడ్ నుంచి కింది వాడకట్టు గాంధీ బొమ్మ నుంచి మసీద్ మీదుగా బస్ స్టాండ్ ఏరియాలో ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు.

కార్యకర్తలు, బీఆర్‌ఎస్ అభిమానులు వేల సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రవీందర్‌గౌడ్ కోరారు. ఎన్నికల ఇన్‌చార్జి మ చ్చ వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు సర్రాఫ్ సతీష్ చారి, మాజీ మున్సిపల్ చెర్మ న్ బొంది రవీందర్ గౌడ్, వెంకట్ గౌడ్, గొర్రె వెంకట్ రెడ్డి, సామల అశోక్ తదితరులు సభా స్థలాన్ని పరిశీలించారు.