06-02-2026 01:01:08 AM
మాగనూరు ,ఫిబ్రవరి. 5. ఈనెల 12న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు భరత్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం మధ్యాహ్న భోజన కార్మికులు సిఐటియు నాయకులు భరత్ కుమార్ ఆధ్వర్యంలో సమ్మె నోటీసును మండల విద్యాధి కారి కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ స్వప్న గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది.
ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోర్టులను అమల్లోకి తెస్తూ 20 25 నవంబర్ 21న ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని విద్యుత్తు సవరణ చట్టం 20 25 ను ఉపసంహరించాలని ,మ ధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెం చాలని, కాటన్ బట్టల యూనిఫామ్ ఇవ్వాలి ,సామాజిక భద్రత కల్పించాలి, గుడ్డుకు అదనపు బడ్జెట్ కేటాయించాలి, ప్రమాద బీమా ,పిఎస్, ఈఎస్‌ఐ ,సౌకర్యాలు కల్పించాలి తదితర డిమాండ్లతో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నామని తెలిపారు .
కార్మిక వర్గ హక్కులపై నిరంతరము దాడి కొనసాగించేందుకు తీసుకువస్తున్న లేబర్ కోర్టులను ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగే ఈ సమ్మెలో కార్మిక వర్గం అధిక సంఖ్యలో మండల కేంద్రంలో జరిగే సమ్మె కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు .మధ్యాహ్న భోజన కార్మికులు కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షిం చాలని వారి డిమాండ్ చేశారు.ఈనెల 12వ జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు అధికార యంత్రాంగం సహకరించాలని వారు కోరారు .
ఈ కార్యక్రమంలో మండల మధ్యాహ్న భోజనం అధ్యక్షురాలు ప్రమీల, గౌసియా బేగం, సంతోషి ,అనిత ,మనెమ్మ ,శంకరమ్మ ,నరసమ్మ, తదితరులు పాల్గొన్నారు.