17 April, 2026 | 11:52 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

బీఆర్ఎస్ స్కాములకు కేరాఫ్ అడ్రస్

22-06-2025 01:09 PM
  1. కౌశిక్ రెడ్డి అరెస్ట్‌కు కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు.
  2. కౌశిక్ రెడ్డి దేశం విడిచి పారిపోతుండగా పోలీసులు అరెస్టు చేశారు.
  3.  హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు.

హుజూరాబాద్,(విజయక్రాంతి): స్కాంలకు కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ అని హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్(Huzurabad Congress Constituency In-charge) ఒడితల ప్రణవ్ బాబు ఆరోపించారు. ఆదివారం హుజూరాబాద్ పట్టణంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ,కేసీఆర్, హరీష్ రావు కాలేశ్వరం స్కాంల చుట్టూ తిరుగుతున్నారు. కేటీఆర్ కార్ రేసింగ్ స్కాంలో, కవిత లిక్కర్ స్కాంలో చిక్కుకున్నారని ఆరోపించారు.ఇవన్నీ సరిపోక, ఇప్పుడు కౌశిక్ రెడ్డి అనే మరో మలకంపును తగిలించుకొని వత్తాసు పలుకుతున్నారన్న ప్రణవ్, కౌశిక్ రెడ్డి అరెస్టును కాంగ్రెస్ పార్టీపై మోపడం పూర్తిగా అనవసరం. ఆయన దేశం విడిచి పారిపోతుండగా, పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు.

ఇది పూర్తి గా చట్ట ప్రక్రియలో భాగమే అని స్పష్టం చేశారు.ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో వ్యాపారస్థుల వద్ద డబ్బులు డిమాండ్ చేసిన కేసులో ఆయనపై కేసులు నమోదయ్యాయని,బెదిరింపులకు గురైన వ్యాపారి భార్య ఫిర్యాదు చేశారని వివరించారు.తప్పు చేయకపోతే ముందస్తు బెయిల్ ఎందుకు వేయాలి?అని ప్రశ్నించారు.ప్రజలను మోసం చేస్తూ గుండెలపల్లి ప్రజలకు నకిలీ చెక్కులు ఇచ్చారని ఆరోపించిన ఆయన,ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నట్లు డ్రామా చేస్తున్నారు అని ఎద్దేవా చేశారు. ఉద్యమ సమయంలో కౌశిక్ రెడ్డి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.హుజూరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని ప్రణవ్ బాబు స్పష్టం చేశారు. అనంతరం పట్టణంలోని దమ్మక్కపేటలో రూ.20 లక్షల నిధులతో సాగునీటి, త్రాగునీటి సరఫరా పైప్‌లైన్ పనులకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మోతే తిరుపతి,నాయకులు రవి, మిడిదొడ్డి శ్రీనివాస్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.