నేడు 'దీక్షా దివస్'
29-11-2024 09:38 AM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రలోని అన్ని జిల్లా కేంద్రాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆధ్వర్యంలో శుక్రవారం 'దీక్షా దివస్' నిర్వహిస్తున్నారు. కరీంనగర్ దీక్షా దివస్ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. సిద్దిపేట 'దీక్షా దివస్' లో హరీశ్ రావు పాల్గొన్నారు. 'దీక్ష దివస్' పేరుతో తెలంగాణ భవన్ లోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బసవతారకం ఆస్పత్రి నుంచి తెలంగాణ భవన్ వరకు బీఆర్ఎస్ పార్టీ ర్యాలీ నిర్వహించనుంది. ర్యాలీలో కేటీఆర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు. ‘కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో’ అంటూ 2009, నవంబర్ 29న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమనేత కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు.






