29 July, 2026 | 4:10 AM

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై సందిగ్ధత

29-11-2024 09:51 AM

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు మద్దతు ఇచ్చినందుకు బిజెపి నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. అటు మహాయుతి కూటమి మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై సందిగ్ధత కొనసాగుతోంది. దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. మహాయుతి నేతలు ఆయనతో దాదాపు గంటపాటు చర్చించారు. మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేతో అమిత్ షా విడిగా సమావేశమయ్యారు. డిసెండర్ 2న మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశముంది. 

సమావేశం తర్వాత, షిండే, ఫడ్నవిస్, పవార్ అర్థరాత్రి దేశ రాజధాని నుండి బయలుదేరారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు నేతలు సమావేశమయ్యారు. మహాయుతి కూటమిలో అంతర్గత విభేదాలు లేవని, నేతలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ముఖ్యమంత్రిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఫడ్నవీస్ కూడా చెప్పారు. మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఫడ్నవీస్, ఎన్‌సిపి అధినేత అజిత్ పవార్ ఇతర మహాయుత నాయకులు అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాను గురువారం ఢిల్లీలో కలిశారు. షా, నడ్డాతో భేటీ అనంతరం ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ, ఈ సమావేశం సానుకూలంగా జరిగిందన్నారు. ముఖ్యమంత్రి పాత్రను ఎవరు స్వీకరించాలనే దానిపై మరో సమావేశం నిర్వహించబడుతుందన్నారు.