22 April, 2026 | 8:17 PM

ఆర్టీసీ సమ్మెకు బిఆర్ఎస్ మద్దతు

22-04-2026 07:16 PM

గజ్వేల్: ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్సు డిపో వద్ద జరుగుతున్న సమ్మెకు బిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బందుకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఆర్టీసీ విలీనంపై, వేతన సవరణలు, రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు.

రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు బంద్ పాటించడం ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఉచిత బస్సు పథకం కారణంగా కార్మికులపై పనిభారం పెరిగినా సమస్యలు పరిష్కరించలేదని అన్నారు. సమ్మె సమయంలో ప్రైవేట్ బస్సులు నడపడం నిలిపివేయాలని, వాటి వల్ల జరిగే ప్రమాదాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందని తెలిపారు.