22 April, 2026 | 9:02 PM

ఐలేని రెడ్డి సంఘం అధ్యక్షునిగా మల్లారెడ్డి

22-04-2026 07:21 PM

బెజ్జంకి: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఐలేని రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి. ఐలేని కుటుంబ సభ్యుల సమక్షంలో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఐలేని రెడ్డి సంఘం నూతన అధ్యక్షుడిగా ఐలేని మల్లారెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గౌరవాధ్యక్షులు  ఐలేని జనార్దన్ రెడ్డి,ఉపాధ్యక్షులు ఐ.మహేందర్ రెడ్డి, ఐ.రాజిరెడ్డి, ఐ.రాజు, జనరల్ సెక్రటరీ, ఐ.నారాయణ రెడ్డి, జాయింట్ సెక్రటరీ జి.సతీష్ రెడ్డి, కోశాధికారి ఐ.లక్ష్మణ్ రెడ్డి, ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు సంఘ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని, సామాజిక సేవా కార్యక్రమాలు, విద్యార్థులకు సహాయం, అవసరమైన కుటుంబాలకు అండగా నిలుస్తామని తెలిపారు.