27 April, 2026 | 8:26 PM

నవాబుపేటలో ఘనంగా బిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

27-04-2026 06:20 PM

నవాబుపేట: నవాబుపేట మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) ఆవిర్భావ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక ఎర్ర సత్యం చౌరస్తా వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాడేమోని నర్సింహులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ పార్టీని స్థాపించారని, ఆయన నాయకత్వంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి  పదవులను సైతం త్యజించి పోరాడారని కొనియాడారు. నేడు రాష్ట్రంలో ఇతర పార్టీలు అధికారంలో ఉన్నాయంటే అది కేసీఆర్  తెచ్చిన తెలంగాణ వల్లే సాధ్యమైందని స్పష్టం చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో కూడా ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు.