ఎస్పీని కలిసిన మెట్‌పల్లి సీఐ
27-04-2026 06:18 PM
మెట్ పల్లి,(విజయక్రాంతి): మెట్‌పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సురేష్ బాబు సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. అనంతరం సిఐ మాట్లాడుతూ మెట్ పల్లి సర్కిల్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలపై తనను నేరుగా కలవచ్చని పేర్కొన్నారు.గంజాయి మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. అలాగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.






