16 April, 2026 | 11:56 AM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

కేసీఆర్ కాళేశ్వరం విచారణ.. అడిగిన ప్రశ్నలివే..

11-06-2025 02:15 PM
  1. కాళేశ్వరం ప్రాజెక్టుపై ముగిసిన కేసీఆర్ విచారణ
  2. కేసీఆర్ ను 50 నిమిషాలపాటు విచారించిన జస్టిస్ పీసీ ఘోష్
  3. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, తీసుకున్న నిర్ణయాలపై క్రాస్ ఎగ్జామినేషన్..
  4. కమిషన్ కు వివరించిన మాజీ సీఎం కేసీఆర్.. 
  5. పలు డాక్యుమెంట్లు పీసీ ఘోష్ కమీషన్ కు అందించిన కేసీఆర్..

హైదరాబాద్:  కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) విచారణ ముగిసింది. మాజీసీఎం కేసీఆర్ ను 50 నిమిషాలపాటు జస్టిస్ పీసీ ఘోష్ విచారించారు. ఆనకట్టల నిర్మాణానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghose Commission) కేసీఆర్ ను ప్రశ్నించింది. కాళేశ్వరం రీ ఇంజనీరింగ్ గురించి కేసీఆర్ పీసీ ఘోష్ కు వివరించారు.  ఆనకట్టల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ఉందా అని కమిషన్ అడిగింది. కేబినెట్ ఆమోదం, ప్రభుత్వ ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం జరిగిందని కేసీఆర్ సూచించారు. వ్యాప్కోస్ సిఫారసుల ప్రకారమే నిర్మాణం జరిగిందన్నారు. నిర్మాణాలకు అన్ని అనుమతులు తీసుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని అంశాలతో ఉన్న పుస్తకాన్ని అందించారు.

కాళేశ్వరం కార్పొరేషన్(Kaleshwaram Corporation) గురించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆరా తీసింది. కొత్త రాష్ట్రంలో నిధులను దృష్టిలో ఉంచుకుని కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు కేసీఆర్ తెలిపారు. కాళేశ్వరం వేగంగా పూర్తి చేసేందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బ్యారేజీల్లో నీటి నిల్వ గురించి కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ అడిగింది. ఎంత నీరు నిల్వ చేయాలన్నది ఇంజినీర్లు చూసుకుంటారని కేసీఆర్ వెల్లడించారు. బ్యారేజీల నిర్మాణ స్థలం ఎంపిక, మార్పు సాంకేతిక పరమైన అంశమని తెలిపారు. నీటి లభ్యత దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం చేపిట్టినట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం అభిమానులకు, పార్టీ నేతలు, కార్యకర్తలకు కేసీఆర్ అభివాదం చేస్తూ అక్కడి నుంచి హరీశ్ రావుతో కలిసి వెళ్లిపోయారు.