19 March, 2026 | 1:25 PM

Breaking News

ఖతార్‌పై దాడి చేస్తే.. ఇరాన్‌లోని గ్యాస్‌ఫీల్డ్ మొత్తాన్ని పేల్చేస్తాం   •   మైదాన ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఎత్తైన ప్రాంతాల్లో మంచు   •   ఢిల్లీలోని వాణిజ్య, పన్నుల భవనంలో అగ్నిప్రమాదం   •   ఇలా అయితే పండుగ ఎలా..?   •   దేశంలో ఉండాలంటే.. వందేమాతరం ఆలపించాల్సిందే.. ఒవైసీ కళాశాలల్లో ఉగ్రమూలాలు   •   బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన సర్పంచులు   •   కరాచీలో వర్షం బీభత్సం: 19 మంది మృతి.. ఎమర్జెన్సీ ప్రకటించిన మేయర్   •   తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు   •   ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కవిత కొత్త పార్టీ   •   శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం   •  

రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు.. పంజాపాలన: ప్రశాంత్ రెడ్డి

03-08-2024 04:02 PM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం బుల్ డోజ్ సమావేశాలుగా మార్చిందని బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ను తిట్టేందుకు సమావేశాలను వినియోగించుకున్నారని ఆరోపించారు. ఆరు రోజుల్లో ప్రశ్నోత్తరాల కోసం ఒక రోజు మాత్రమే అవకాశం ఇచ్చారని విమర్శించారు. జీరో అవర్ ప్రస్తావనే లేకుండా పోయిందన్నారు. కేవలం రెండు రోజుల్లోనే పద్దులపై చర్చ పూర్తి చేశారని తెలిపారు. సమస్యలను ప్రస్తావిస్తే మైక్ కట్ చేశారని మండిపడ్డారు. నిరసన తెలిపితే మార్షల్స్ తో సభ నుంచి బయటకు పంపించారని వెల్లడించారు. రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు.. ప్రతిపక్షాలపై పంజాపాలన అని ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.