20 June, 2026 | 2:20 PM

ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు.. దగా రాజ్యం: లింగాల కమల్ రాజు

20-06-2026 01:49 PM

ధాన్యంపై కాంగ్రెస్ దగ నయవంచన మోసానికి కేరాఫ్ కాంగ్రెస్

వ్యవసాయం అంటే దండుగ కాదు పండుగ అని రైతును రాజును చేసిన కెసిఆర్

 ధాన్యం కొనుగోలులో దగ 

రైతు భరోసాకు కోతలు 

రైతు భీమాకు మంగళం పాడిన కాంగ్రెస్

జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ చైర్మన్ మధిర నియోజకవర్గం ఇంచార్జ్ లింగాల కమల్ రాజు 

మధిర,(విజయ క్రాంతి): మధిర టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో లింగాల కమల్ రాజు మాట్లాడుతూ  గతంలో 33 రకాల సన్న వడ్లకు ఇచ్చే బోనస్ ను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు రకాల కే కుదించి రైతు కంట కన్నీరు తెప్పిస్తున్నదని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టినారు.  అధికారం కోసం రైతులు అందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అన్ని రకాల సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తాము అని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక తెప్ప తగలేసినట్లు ఉంది కాంగ్రెస్ వ్యవహారము అని దుయ్యబట్టిన కమల్ రాజు. రేవంత్ ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తాము అని చెప్పిన గొప్పలకు రైతుల తిప్పలు బోనస్ ఇస్తుంది అనే ఆశతో రైతులు సన్నాలనే పండిస్తున్నారు

కానీ ప్రస్తుతం ఏడు రకాల కు మాత్రమే కుదించి రైతులను మోసం చేస్తుంది అని కాంగ్రెస్ డిఎన్ఏ లోనే మోసం ఉన్నదని విమర్శించినారు రైతులకు ఏదో చేస్తున్నాము అని చెప్పే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటినుండి ప్రతి విషయంలో మోసం చేస్తున్నది  అధికారంలోకి రాకముందు లగేత్తండి పరిగెత్తండి అని చెప్పి రెండు లక్షల రుణం అని మాయ మాటలు చెప్పి అనేకమందికి ఇవ్వకుండా ఎగ్గొట్టింది రైతు భరోసా ఎకరానికి 15000 అని మోసం చేసింది కాంగ్రెస్ అలాగే ఎరువుల కోసం కళ్ళు కాయలు కాసేలా చేసి లైన్లో నిలబెట్టి అది కూడా ఇవ్వటం చేతగాక ఎటువంటి ప్రణాళిక లేక యాప్ ని తీసుకువచ్చి రైతుల కంట కన్నీరు పెట్టిస్తుంది

 ఇప్పుడు సన్న వడ్లకు బోనస్ ఇవ్వటం చేతగాక కేంద్ర ప్రభుత్వంపై సాకులు చెబుతూ ముఖ్యమంత్రి రేవంత్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల,  డిప్యూటీ మంత్రి బట్టి తమ చేతకానితనాన్ని బయట పెట్టుకుంటున్నారు అని ఘాటుగా విమర్శించినారు ఇకనైనా అబద్ధపు మాటలు కట్టిపెట్టి రైతులకు సన్న వడ్లకు 33 రకాల సన్న వడ్లకు గతంలో ఇస్తాము అని చెప్పిన 500 రూపాయల చొప్పున ప్రతి బస్తాకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ 

కేవలం ఖమ్మం జిల్లాలోనే ఈ వానాకాలం సీజన్లో  3.20 లక్షల ఎకరాలలో సన్నాల వరి సాగు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచన వేశారని  ప్రతి గింజను రైతుల వద్ద నుండి కొనాలని  లేనియెడల రైతులతో ప్రత్యక్ష కార్యాచరణ ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తాము అని హెచ్చరించినారు రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వము మనుగడ కూడా సాధించలేదని అది తెలుసుకొని రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేసినారు