మండల ఉపసర్పంచుల ఫోరం
20-06-2026 01:50 PM
అధ్యక్షురాలిగా బదావత్ సీత మహాలక్ష్మి
కోదాడ,(విజయక్రాంతి): కోదాడ మండల ఉపసర్పంచుల సమావేశంలో మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షురాలిగా బదావత్ సీత మహాలక్ష్మి కుమారస్వామిని ఉపసర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు తెలియజేస్తూ, ఆమె నాయకత్వంలో ఉపసర్పంచుల సంక్షేమం, గ్రామాభివృద్ధి కార్యక్రమాలు మరింత విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ఉపసర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షురాలు బదావత్ సీత మహాలక్ష్మి మాట్లాడుతూ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆదేశాల మేరకు గ్రామాల అభివృద్ధి, ఉపసర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.






