6 June, 2026 | 4:38 PM

Breaking News

వికారాబాద్‌లో ఘోరప్రమాదం.. హోటల్ స్లాబ్ కూలి ఒకరు మృతి   •   హైదరాబాద్‌లో భారీ వర్షం   •   ధాన్యం అన్‌లోడ్ ఆలస్యం.. రాజీవ్ రహదారిపై రైతుల బైఠాయింపు   •   అధికార లాంఛనాలతో ఏఆర్ కానిస్టేబుల్ రాజు అంత్యక్రియలు   •   Phone Tapping Case: కేసీఆర్‌పై ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు   •   బడి ఈడు పిల్లలను పాఠశాలలు చేర్పించాలి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ప్రధాన లక్ష్యం : జిల్లా కలెక్టర్ అంకిత్   •   అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి   •   ఇసుక కొరతను నివారించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి   •   మంథని టీజీఎస్‌ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక   •  

ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ 55 ఎంపిక

06-06-2026 03:39 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా నుండి ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ కు 55 మంది విద్యార్థులు ఎంపికైనట్లు నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న తెలిపారు. జిల్లాలో అత్యధికంగా మస్కాపూర్ జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల నుండి 26 మంది ఎంపిక కాగా పొనకల్, బీరవెల్లి, మామడ, నర్సాపూర్ జీ పాఠశాలల నుండి ముగ్గురు చొప్పున, రాజుర, మంజులాపూర్ గర్ల్స్ హై స్కూల్ సోమ్వారిపేట్, లక్ష్మణ్ చందా పాఠశాల నుండి ఇద్దరు చొప్పున, మున్యాల, పెంబి, కడెం, లింగాపూర్, జాఫ్రాపూర్, కొరటికల్ ,కుబీర్, మోడల్ స్కూల్ కుంటాల నుండి ఒకరు చొప్పున ఎంపికైనట్లు వెల్లడించారు. ఈ విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతూ  ఈ పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. ఈ ఎంపికైన విద్యార్థులకు ప్రతి సంవత్సరం 12000 చొప్పున నాలుగు సంవత్సరాలు పాటు స్కాలర్షిప్ లభిస్తుందని చెప్పారు